ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | APEPDCL Notification 2024 | Freejobsintelugu

APEPDCL Notificatiom 2024:

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుండి 3 సంవత్సరాల కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి సంబందించి మేనేజర్ పోస్టుల భర్తీకి ఉద్యోగాల ప్రకటనను విడుదల చేసారు. మొత్తం 05 మేనేజర్-IT /డేటా ఎనాలిసిస్, డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ అప్లికేషన్స్, SAP విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ఫీజు లేదు. ₹30,000/- శాలరీ ఉంటుంది. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

ప్రకటనలోని పోస్టుల వివరాలు:

విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) నుండి 05 మేనేజర్ /IT ఉద్యోగాలను 3 సంవత్సరాలపాటు కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి ప్రకటన జారీ చేశారు. 5 విభాగాల్లో 05 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Join Our Telegram Group

అర్హతలు, వయస్సు:

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ లేదా B TECH /M. TECH / MCA లో డిగ్రీ లేదా పీజీ చేసినవారు, 5- 8 అనుభవం ఉన్నవారు అర్హులు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి వయో సదలింపు లేదు.

ఇస్రోలో 10వ తరగతితో గవర్నమెంట్ జాబ్స్

జీతం, కాంట్రాక్ట్ కాలపరిమితి:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వేతనం చెల్లిస్తారు. 3 సంవత్సరాల వరకు కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. తర్వాత డిపార్ట్మెంట్ వారు ఉద్యోగుల అవసరాన్ని భట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగిస్తారు.

ఇంటర్వ్యూ ప్రదేశం, తేదీ:

ఆగష్టు 28వ తేదీన విశాఖపట్నంలోని చీఫ్ జనరల్ మేనేజర్/HRD, APEPDCL కార్పొరేట్ ఆఫీస్, సీతమ్మధార, P&T కాలనీనందు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

TGSRTC లో 10TH అర్హతతో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు:

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లికేషన్

ముఖ్యమన సూచనలు:

• గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత డిగ్రీ /పీజీ చేసి, 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

• ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు దరఖాస్తుతో పాటు CV మరియు 200 పాదాలతో ఎందుకు ఈ ఉద్యోగాలకు ఆసక్తి చూపిస్తున్నారో తెలియచేస్తూ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

• అర్హత సర్టిఫికెట్స్ తో పాటు అప్లికేషన్ ఫారం, వయస్సు,అనుభవం సర్టిఫికెట్స్, లేటెస్ట్ CV తీసుకొని రావాలి

• హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA ఇవ్వడం జరగదు.

AP సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు

ఎలా అప్లై చెయ్యాలి:

ఈ క్రింది నోటిఫికేషన్ లింక్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరుకావలెను.

Notification PDF

Application Form

ఆంధ్రప్రదేశ్ విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ Freejobsintelugu ని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!