గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ వస్తుందా? | AP Grama Ward Sachivalayam 3rd Notification 2024 | Latest Jobs In Telugu

AP Grama Ward Sachivalayam 3rd Notification Update:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన 14,000+ గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక Bad న్యూస్ ప్రభుత్వం నుండి ఈరోజు రావడం జరిగింది.

రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డుసచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సం ఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేష నలైజేషన్ కు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

విధి విధానాలు ఇలా ఉన్నాయి:

డైరెక్టర్, GSWS, విజయవాడ అభ్యర్థనను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, G.O.Ms.No.71, Fin (HR. IPLG & PLG&POLICY) డిపార్ట్‌మెంట్., Dt: 17.05.2023, పోస్ట్‌లు భర్తీ అయ్యే వరకు. Rationalization కసరత్తు చేపట్టాలి. కొత్త జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్న పూర్వ జిల్లాల కలెక్టర్లు.గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలోని కార్యకర్తల హేతుబద్ధీకరణ ప్రక్రియ ఈ ఆర్డర్‌కు జోడించబడింది.

Join Our Telegram Group

•ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు

•జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు

• ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ” ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే, వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు.

• వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు.

పోస్టల్ ఆఫీసుల్లో 30,700 పోస్టుల భర్తీ: Apply

Intel ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు: Apply

తెలంగాణాలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

Byjus పరీక్ష లేకుండా పర్మినెంట్ WFH జాబ్స్: Apply

• గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది.

• గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో

• మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది.

• అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు.

• మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు.

• వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి.

• ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు.

• కావున ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం నుండి విడుదల కావాల్సిన ఈ ఉద్యోగాలు విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ.

Official Order PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!