CSIR CLRI Notification 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 13 పోస్టులతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 10+2 అర్హత కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
CSIR ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ |
| పోస్టు పేరు | జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ |
| మొత్తం పోస్టులు | 13 |
| అర్హతలు | పదో తరగతి / 10+2 పాస్ |
| లాస్ట్ డేట్ | మార్చ్ 02, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన 13 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు విద్యా అర్హతలలో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లమా పాస్ అయిన అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు:
CSIR కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే పోస్టులను అనుసరించి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాలు వయసు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది విధంగా కేటగిరీల వారీగా ఫీజులు ఉంటాయి.
- రిజర్వేషన్ లేని అభ్యర్థులకు : ₹500/- ఫీజు ఉంటుంది.
- రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, pwd అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు లేదు
ఎంత శాలరీ ఉంటుంది :
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు ₹35వేల రూపాయల నుండి ₹55 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
CSIR ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- అప్లై చేసుకున్న వారికి రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
- మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు
ముఖ్యమైన తేదీలు:
CSIR లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | జనవరి 23, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ | మార్చ్ 3, 2026 |
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.