Railway IRCTC Notification 2026:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి సంబంధించిన IRCTC నుండి 43 హాస్పిటల్ మానిటర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ లో బ్యాచులర్స్ డిగ్రీ BSC చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఫ్రెషర్ కాండిడేట్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా అభ్యర్థులకు ఉన్న అర్హతలను ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి, మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేయండి.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
రైల్వే IRCTC ఉద్యోగుల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | రైల్వే IRCTC డిపార్ట్మెంట్ |
| పోస్టుల పేర్లు | హాస్పిటాలిటీ మానిటర్స్ |
| మొత్తం పోస్టులు | 43 |
| అర్హతలు | హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ BSC అర్హత |
| ఇంటర్వ్యూ తేదీలు | ఫిబ్రవరి 17, 24, 27, మార్చి 5, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
రైల్వే బోర్డుకి సంబంధించిన ఐఆర్సిటిసి డిపార్ట్మెంట్ నుంచి హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు బ్యాచులర్స్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన బీఎస్సీ అర్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ అభ్యర్థులందరూ దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు. రైల్వే విధానాల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
రైల్వే ఐఆర్సిటిసి కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
ఎంత శాలరీ ఉంటుంది:
రైల్వే ఐఆర్సిటిసి పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ₹30 వేల జీతంతో పాటు, ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
రైల్వే ఐ ఆర్ సి టి సి ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు అర్హతలు ఉన్నట్లయితే నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి
- ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేదు
- ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
రైల్వే ఐఆర్సిటిసి పోస్టులకు అప్లై చేసుకునే వారు ఈ క్రింది తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కావలెను.
- ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు: ఫిబ్రవరి 17, 24, 27, మార్చి 5, 2026.
- ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశాల వివరాలను నోటిఫికేషన్ లో చూడగలరు
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్లు అన్ని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
రైల్వే ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ని www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.