CSIR IITR Notification 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుండి ఆరు పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ ఉద్యోగాలకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
CSIR IITR డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ |
| మొత్తం పోస్టులు | 06 |
| పోస్టుల పేర్లు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్ |
| అర్హతలు | పదో తరగతి |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 19, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల విద్యార్హతలు:
CSIR IITR సంస్థ నుండి విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర రిజర్వేషన్స్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.
శాలరీ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30 వేల నుండి ₹40,000 వరకు జీతాలు ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్:
CSIR IITR కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేవారు జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను సందర్శించండి.