AP District Court Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుండి 44 పోస్టులతో జిల్లా కోర్టులో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం :
ఆంధ్రప్రదేశ్ 13 జిల్లా కోర్టుల ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సెలక్షన్ అథారిటీ |
| పోస్టుల పేర్లు | రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ |
| మొత్తం పోస్టులు | 44 |
| అర్హతలు | పదవ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత |
| లాస్ట్ డేట్ | జనవరి 27, 2026 |
| అఫీషియల్ వెబ్సైట్ | Click Here |
పోస్టుల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాల నుండి విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- రికార్డ్ అసిస్టెంట్ – పదవ తరగతి అర్హత
- డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ – ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైపింగ్ మరియు కంప్యూటర్ ఆపరేటింగ్ లో మూడు సంవత్సరాల అనుభవంతో పాటు ఎమ్మెస్ ఆఫీస్ వచ్చి ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. Sc, st, obc, ews అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టులను అనుసరించి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹35 వేల రూపాయలు, డేట్ అండ్ ఆపరేటర్ మరియు ఫ్రెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ₹75 వేల రూపాయలు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టులకు ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకునేవారు ఈ క్రింది అప్లికేషన్ ఫీజులను కేటగిరీల వారీగా చెల్లించాలి.
- OC, BC అభ్యర్థులు : ₹1000/- ఫీజు చెల్లించాలి
- SC, ST, EWS, PHC : ₹500/- ఫీజు చెల్లించాలి
- అప్లికేషన్ ఫీజులను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అభ్యర్థులు చెల్లించవలెను.
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ పెడతారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు జనవరి 27, 2026 తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించవలెను.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లై చేయండి.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.