APEPDCL నోటిఫికేషన్ 2026:
ఆంధ్రప్రదేశ్లోని ఈస్టర్ను పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) నుండి సెంటర్ హెడ్ ఉద్యోగాలను తాత్కాలిక విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, కనీసం ఐదు సంవత్సరాల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగుల సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకుందాం.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
APEPDCL నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ ఈస్టర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEPDCL) |
| పోస్టుల పేరు | సెంటర్ హెడ్ |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు కనీసం ఐదు సంవత్సరాల నుంచి గరిష్టంగా పది సంవత్సరాల అనుభవం ఉండాలి |
| వయస్సు | 18 నుండి 45 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 7, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (APEPDCL) నుండి కాంట్రాక్టు విధానంలో విడుదలైన సెంటర్ హెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు విద్యుత్ సరఫరా సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంత శాలరీ ఉంటుంది?:
ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినా కూడా నెలకు ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది
ఎంపిక విధానం:
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- అభ్యర్థులకు రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆదారిత పరీక్ష నిర్వహిస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
అప్లికేషన్ ఫీజు?:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
APEPDCL నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది తెలిపిన తేదీలలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | జనవరి 9, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 7, 2026 |
ఎలా అప్లై చెయ్యాలి?:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.