AP Airport Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎయిర్పోర్టులో పని చేయడానికి, ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.10+2 అర్హత కలిగిన వారికి 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత మంచి ప్రతిభ కనబరిచిన వారికి పర్మినెంట్ జాబ్స్ ఇవ్వనన్నారు. ట్రైనింగ్లో ₹10,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా, అర్హతలు ఉన్నవారు జనవరి 13వ తేదీలోగా వారి యొక్క వివరాలను మెయిల్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు తిరుపతి ఎయిర్పోర్ట్ లో పనిచేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ తిరుపతి నుండి విడుదలైన ఉద్యోగుల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AI ASL) |
| పోస్ట్ పేరు | ప్యాసింజర్స్ సర్వీసెస్ ఏజెంట్ ట్రైని |
| అర్హతలు | 10+2 pass |
| స్టిపెండ్ | నెలకు ₹10,000/- |
| లాస్ట్ డేట్ | 13th జనవరి, 2026 |
| వెబ్సైట్ లింక్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
AP AIASL నుండి విడుదలైన ప్యాసింజర్స్ సర్వీసెస్ ఏజెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10+2 అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు. నోటిఫికేషన్ లో వివరాలు చూడవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్?:
ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న వారిని క్రింది విధంగా ఎంపిక చేస్తారు.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు
- అభ్యర్థుల అర్హతలను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
స్టైపెండ్ ఎంత ఉంటుంది?:
ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటగా 11 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు ₹10,000/- స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులను పర్మినెంట్ ఎంప్లాయిస్ గా చేస్తారు.
అప్లికేషన్ ఫీజు ఉందా?:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు మీ యొక్క వివరాలు పంపించవలెను.
ఆఖరి తేదీ:
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జనవరి 13, 2026వ తేదీ వరకు సమయం కేటాయించారు. కావున ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్స్ ని ఆన్లైన్లో పంపించవలెను.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ఎయిర్పోర్టులో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.