AP EdCIL Notification 2026:
ఆంధ్రప్రదేశ్ లోని ది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా (EdCIL) సంస్థ నుండి 424 డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
ఏపీలోని విద్యాశాఖ EdCIL సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | ది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా (EdCIL) |
| పోస్ట్ పేరు | డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ |
| మొత్తం పోస్టులు | 424 |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ |
| లాస్ట్ డేట్ | జనవరి 18, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ నుండి 424 కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన వారికి రెండు సంవత్సరాలు అనుభవం కూడా ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి అవసరం లేదు
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు విద్యా శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అన్న వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹30 వేల రూపాయలు జీతాలు చెల్లిస్తారు. అలాగే కన్వెన్యన్స్ ఎలెవన్స్ కింద ₹4000/- చెల్లిస్తారు. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
ఎలా ఎంపిక చేస్తారు?:
ఆంధ్రప్రదేశ్లోని విద్యా శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
- డాక్యుమెంట్స్ పరిశీలన ఉంటుంది
- అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 6th జనవరి, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ | 18th జనవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి, అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి