AP Outsourcing Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేయడానికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో 35 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రిషన్, అకౌంటెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చెయ్యడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్ చేసినవారు అర్హులు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల యొక్క పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ |
| పోస్టుల పేరు | డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ఇతర పోస్టులు |
| మొత్తం పోస్టులు | 35 పోస్టులు |
| అర్హతలు | 10th, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్ |
| ఆఖరు తేదీ | 20th డిసెంబర్, 2025 |
| Official Website | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్ వంటి పలు విభాగాల్లో అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
నేషనల్ హెల్త్ మిషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్?:
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
- ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.
- అభ్యర్థులకు అర్హతలు వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు?:
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- OC, BC అప్లికేషన్ ఫీజు : ₹300/-
- SC, ST అప్లికేషన్ ఫీజు : ₹200/-
- వికలాంగులకు అప్లికేషన్ ఫీజు లేదు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 20వేల నుండి 45 వేల రూపాయల వరకు శాలరీలు చెల్లిస్తారు. ఇది అవుట్సోర్సింగ్ లేదా కాంటాక్ట్ ఉద్యోగాలయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
ముఖ్యమైన తేదీలు?:
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th డిసెంబర్, 2025 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | 20th డిసెంబర్, 2025 |
| మెరిట్ లిస్ట్ | 8th జనవరి 2026 |
| సెలక్షన్ లిస్ట్ | 12th జనవరి 2026 |
ముఖ్యమైన లింక్స్:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.
ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ని ప్రతిరోజు సందర్శించండి.