DRDO Recruitment 2025:
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి ఐదు ఇంటర్న్షిప్ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మరియు ఎంఎస్సీ ఫిజిక్స్ లో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి, స్టైపెండ్ తో పాటు సర్టిఫికేషన్ ఇస్తారు. కావున అన్ని అర్హతలు కలిగిన వారు కడుపులోగా దరఖాస్తులు చేసుకోవాలని, డిఆర్డిఓ సంస్థ ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
డిఆర్డిఓ సంస్థ నుండి విడుదలైన ఇంటర్న్షిప్ ఉద్యోగాల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) |
| పోస్టుల పేరు | ఇంటర్న్ షిప్ రిక్రూట్మెంట్ |
| అర్హతలు | ఆఖరు సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్ అభ్యర్థులు అర్హులు. |
| ఆఖరి తేదీ | 20 రోజుల్లో అప్లై చేయాలి |
| జాయిన్ అయ్యే తేదీ | జనవరి 01, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
డిఆర్డిఓ నుండి విడుదలైన ఇంటర్షిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్ అభ్యర్థులు అయితే వెంటనే అప్లై చేసుకోవాలి.
ఎంత వయసు ఉండాలి?:
డిఆర్డిఓ ఇంటర్న్షిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఇంజనీరింగ్ డిగ్రీలో ఫైన్ లేదు చదువుతున్న విద్యార్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్టైపెండ్ ఎంత ఉంటుంది:
డిఆర్డిఓ ఇంటెన్షిప్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 5000 రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తారు. ఆరు నెలల వరకు ఇంటర్న్ షిప్ ఉంటుంది కావున నెలకు 5000 రూపాయలు చొప్పున అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్:
డి ఆర్ డి ఓ ఇంటెన్షిప్ రిక్రూట్మెంట్ కి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్ షార్ట్ లిస్టు చేస్తారు.
- సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ నుండి అంగీకార పత్రం తెచ్చుకోవాలి.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- జనవరి 01, 2026న జాయిన్ కావలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు?:
డి ఆర్ డి ఓ కాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది ముఖ్యమైన తేదీలను గమనించుకోవాలి.
- అప్లికేషన్ సబ్మిట్ ఆఖరి తేదీ : నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 20 రోజుల్లోగా అప్లికేషన్ పంపించాలి
- సెలెక్ట్ అయిన అభ్యర్థుల రిజల్ట్స్ విడుదల తేదీ : 25th డిసెంబర్, 2025
- అభ్యర్థులు జాయిన్ అవ్వాల్సిన తేదీ : జనవరి 1, 2026.
ముఖ్యమైన లింక్స్:
డిఆర్డిఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.