AP రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | AP Revenue Dept. Notification 2024 | Freejobsintelugu

AP Revenue Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 40 పోస్టులతో ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్, ఈ – డివిజనల్ మేనేజర్స్ పోస్టుల భర్తీ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH, BSC, BCA, మాస్టర్స్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఉద్యోగాల ప్రకటన లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం భీముని పట్నంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం నుండి 40 ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్, ఈ – డివిజనల్ మేనేజర్స్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. Be, btech, Bca, bsc అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Join What’sApp Group

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు చేసే విధానం:

అర్హతలు ఉన్న అభ్యర్థులు మొదటగా www.visakhapatnam.ap.gov.in వెబ్సైటు నందు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ఫారంను ఆఫ్ లైన్ విధానంలో విశాఖపట్నం కలెక్టర్వారి కార్యాలయానికి 4th నవంబర్ 2024 తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th, ఇంటర్ అర్హత

ఎంపిక విధానం :

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల తేదీలు నోటిఫికేషన్ లో పొందుపరచలేదు.

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, St, obc, ews అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తపాలా శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు :

దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు లేకుండా మొదటగా ఆన్లైన్, తర్వాత ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ ఎంత ఉంటుంది:

సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹22,500/- ఫిక్స్డ్ శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయిననందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

తెలంగాణా మున్సిపల్ శాఖలో 316 గవర్నమెంట్ జాబ్స్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి:

ఆన్లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th మార్క్స్ మెమో, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.

ఎలా అప్లికేషన్ చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు

Join WhatsApp Group

Notification PDF

Apply Online Link

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!