Income Tax Dept Notification 2026:
ఆదాయపు పన్ను శాఖ ముంబై డిపార్ట్మెంట్ నుంచి క్రీడా విభాగంలో ఖాళీగా ఉన్న 97 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాలకు క్రీడా విభాగాల్లో పాల్గొని సర్టిఫికెట్స్ కలిగి విజయాలు సాధించిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్రీడా అర్హతలతో పాటు పదోతరగతి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించిన ట్రయల్ టెస్టులు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
ఆదాయపు పన్ను శాఖ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆదాయపు పన్ను శాఖ |
| మొత్తం పోస్టులు | 97 |
| పోస్టుల పేర్లు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, |
| అర్హతలు | పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ |
| లాస్ట్ డేట్ | జనవరి 31, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల విద్యార్హతలు:
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా విధానంలో 97 ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొన్న అర్హతలు కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది
ఎంత వయస్సు ఉండాలి :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు:
ఆదాయపు పన్ను శాఖ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరిల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ఎందుకు అభ్యర్థులు అప్లికేషన్స్ గడువులోగా పంపించాలి
- ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా
- స్పోర్ట్స్ ట్రయల్ టెస్టులు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
శాలరీ ఎంత?:
ఆదాయపు పన్ను శాఖ మూడు రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి 35వేల రూపాయల నుండి 70 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు.
అప్లికేషన్స్ ఆఖరు గడువు :
ఆదాయపు కొన్ని శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జనవరి 31 2026 తేదీలోగా అప్లికేషన్స్ ని సంబంధిత అడ్రస్ కి పంపించవలెను
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు ఇక్కడి నుంచి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే గడువులోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com నీ ప్రతిరోజు విజిట్ చేయండి.