ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RK Puram Army Public School Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 16, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Army Public School Jobs Notification 2026:

సికింద్రాబాద్లోని, ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 38 పోస్టులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమెరీ టీచర్స్, ప్రీ ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు 4 సంవత్సరాల పాటు ఆ పాఠశాలలో పనిచేయాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, సంబంధిత పోస్టులకు అర్హతలు కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. బీఈడీతోపాటు సీటెట్ లేదా స్టేట్ టెట్ పరీక్ష అర్హత కలిగిన వారు, AWES OST పరీక్షల ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

సికింద్రాబాద్లోని సైనిక్ స్కూల్ నుండి విడుదలైన టీచింగ్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్
పోస్టుల పేర్లుపీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, ప్రీ ప్రైమరీ టీచర్స్
మొత్తం పోస్టులు38
అర్హతలు ఏదైనా డిగ్రీ లేదా పీజీ తో పాటు డిఎడ్, బిఎడ్, సీటెట్ లేదా స్టేట్ టెట్ అర్హత ఉండాలి.
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 3, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

సికింద్రాబాద్ ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి విడుదలైన టీచర్ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు డీఎడ్ లేదా బిఎడ్ అర్హత కలిగి, సీటెట్ లేదా స్టేట్ టెట్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితులు సడలింపు ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు :

ఈ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే “ARMY PUBLIC SCHOOL RK PURAM” పేరు మీద ₹250 రూపాయల ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించి, అప్లికేషన్ ఫారం తో పాటు పంపించవలెను.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 30 వేల నుండి 55 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు

సెలక్షన్ ప్రాసెస్:

ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా, సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు

ముఖ్యమైన తేదీలు:

ఫిబ్రవరి 3, 2026 తేదీలోగా ఈ క్రింది తెలిపిన అడ్రస్ కు అప్లికేషన్స్ పంపించవలెను.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
  • Principal, Army Public School RK Puram, Secunderabad – 500056

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.

Notification PDF

Official Website

ప్రభుత్వ పాఠశాలల నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page