Telangana Outsourcing Jobs 2026:
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి 22 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషన్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, కిచెన్ బాయ్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ అని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు :
తెలంగాణ వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణలోని నర్సింగ్ వైద్య కళాశాల |
| పోస్టుల పేర్లు | డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషన్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, కిచెన్ బాయ్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్ |
| మొత్తం పోస్టులు | 22 |
| అర్హతలు | 10th, 10+2,ఏదైనా డిగ్రీ |
| లాస్ట్ డేట్ | 12th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి విడుదలైన 22 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అనుభవం అవసరం లేదు
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు?:
ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. అన్ని కేటగిరీలో అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం?:
తెలంగాణ నర్సింగ్ వైద్య కళాశాల నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి
- ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్క్లు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని అనుసరించడం జరుగుతుంది
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించే ₹15,600/- నుండి ₹19,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉండవు.
ముఖ్యమైన తేదీలు:
అన్ని అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే జనవరి 12, 2026 తేదీలోగా అప్లికేషన్స్ ని ఆఫ్లైన్ విధానంలో పూర్తిచేసి పోస్టు ద్వారా పంపించవలెను.
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోండి.
తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను వెంటనే సందర్శించండి.