Telangana District Court Jobs 2026:
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రబ్ అండ్ సెక్షన్స్ కోడ్ నుండి కాంట్రాక్టు విధానంలో హెడ్ క్లర్క్, ఆఫీసు సబర్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో నిర్ణయిత గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం:
తెలంగాణ జిల్లా కోర్టు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోర్ట్ |
| పోస్ట్ పేరు | హెడ్ క్లర్క్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులు |
| అర్హతలు | పదవ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత |
| వయస్సు | 18 నుండి 34 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | జనవరి 12, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
తెలంగాణ జిల్లా కోర్టు నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
అభ్యర్థులు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు
ఎంపిక విధానం?:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా గడువు లాగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టులను అనుసరించి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹15,600/- నుండి ₹40,000/- వరకు సాలరీస్ ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు
ముఖ్యమైన తేదీలు:
తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ ని పోస్ట్ ద్వారా పంపించాలి. నేరుగా దరఖాస్తులు చేసుకుంటే అవి అంగీకరించబడవు.
| దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ | 12th డిసెంబర్, 2025 |
| దరఖాస్తు స్వీకరణ ఆఖరి తేదీ | 12th జనవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసినవారు అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి.
Notification & Application Form
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.