ICAR CRRI Jobs Notification 2026:
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖకు సంబంధించిన ICAR సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు ఐటిఐ లో గాని లేదా 10+2 లో అగ్రికల్చర్ సంబంధిత విభాగంలో గాని లేదా రెండు సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ICAR సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ |
| పోస్ట్ పేరు | ఫీల్డ్ అసిస్టెంట్ |
| అర్హతలు | 10th/10+2/ITI |
| వయస్సు | 18 నుండి 50 సంవత్సరాలు |
| ఇంటర్వ్యూ తేదీ | 12th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ICAR సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి అర్హతతో పాటు 10+2 లో కూడా అర్హత కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ విభాగంలో అనుభవం ఉన్నవారికి అలాగే అర్హతలు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు వ్యవసాయ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉండే అవకాశం ఉంది
అప్లికేషన్ ఫీజు :
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏ కేటగిరి వారికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీలవారు ఉచితంగా అప్లై చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
- ఇటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
వ్యవసాయ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18000 శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ ఏమి ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి.
ఇంటర్వ్యూ తేదీ :
వ్యవసాయ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జనవరి 12, 2026 న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, అర్హతలు కలిగిన వారికి పోస్టింగ్ ఇస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?:
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన వారు క్రింది నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.