AP Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఈస్ట్ గోదావరి జిల్లా నుండి, 60 ఆఫీస్ సబార్డినేట్ అలాగే అటెండర్ పోస్టులను ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులకు అర్హతల్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం :
ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల యొక్క సమాచారాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఏపీ మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ |
| పోస్టుల పేర్లు | ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, అనస్థీషియా టెక్నీషియన్ |
| మొత్తం పోస్టులు | 60 |
| అర్హతలు | పదవ తరగతి |
| లాస్ట్ డేట్ | 9th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అలాగే పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితులు మరో ఐదు సంవత్సరాలు సదలింపు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది దరఖాస్తు ఫీజులు చెల్లించాలి.
- ఓసి అభ్యర్థులు అయితే : ₹300/-
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, pwd అభ్యర్థులు అయితే : ₹200/- ఫీజు చెల్లించాలి.
- ఈ ఫీజులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవలెను.
సెలక్షన్ ప్రాసెస్:
ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
- అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు ఉన్నవారికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎంత జీతం ఉంటుంది?:
ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి జీతాలు ఉంటాయి. ₹15,000/- నుండి ₹30 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు
ముఖ్యమైన తేదీలు?:
ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
- ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 26th డిసెంబర్, 2025
- ఆఫ్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 9th జనవరి, 2026
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు క్రింది నుండి నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత చిరునామా కి గడువులోగా అప్లికేషన్స్ ని పంపించవలెను.
ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను విజిట్ చేయండి.