TGSRTC లో సూపర్వైజర్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TGSRTC Supervisor Trainee Jobs Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 25, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TGSRTC Supervisor Trainee Jobs Notification 2025:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి 198 ట్రైనీ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత లేదా ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకటే రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పోస్టుల పేరు ట్రైన్ సూపర్వైజర్ ట్రైని, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ
మొత్తం పోస్టులు198
అర్హతలు డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత
ఆఖరి తేదీ 20th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు :

TGSRTC నుండి విడుదలైన ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అన్న ఎస్సీ, ఎస్టీ ,ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

తెలంగాణ ఆర్టీసీ నుండి విడుదలైన ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. అందుకే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
  2. 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. రాత పరీక్షలు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు చెల్లించవలెను.

  • SC, ST అభ్యర్థులకు : ₹400/- ఫీజు
  • ఇతర అభ్యర్థులకు : ₹800/- ఫీజు.
  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజుని ఆన్లైన్లోనే చెల్లించాలి

ఎంత శాలరీ ఉంటుంది?:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹81,400/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 30th డిసెంబర్, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 20th జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు గడువులోగా ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లై చేయండి.

Notification PDF

Apply Online Link

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page