APSRTC Jobs: ఏపీఎస్ఆర్టీసీ లో ఉద్యోగాలు – ధ్రువపత్రాలు పరిశీలన తేదీలు విడుదల : అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు

By: Sivakrishna Bandela

On: December 24, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APSRTC Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో 291 అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు దృపత్రాల పరిశీలనకు సంబంధించి, ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అప్రెంటిస్ కాలేలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ తేదీలలో దృపత్రాల పరిశీలనకు హాజరయ్యి సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ల పరిశీలన చేసి అర్హులైన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా అప్రెంటిషిప్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటీషిప్ కార్యాలకి సంబంధించి సర్టిఫికెట్ల పర్సనల్ యొక్క ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

మొత్తం ఎన్ని పోస్టులు?:

ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల 291 అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి అర్హతతో పాటు ఐటిఐ లోని సంబంధిత ట్రేడ్లలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటనలో తెలిపింది. అర్హులైన చాలామంది అభ్యర్థులు, ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు దృపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంది.

ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమైన తేదీలు:

ఏపీఎస్ఆర్టీసీ 291 అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో దృపత్రాల పరిశీలనకు హాజరు కావాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details
  • డిసెంబర్ 24న : మోటార్ మెకానిక్, ఫిట్టర్, డ్రాట్స్ మాన్, సివిల్ , వెల్డర్, పెయింటర్ అండ్ మిషన్ ట్రేడ్లకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
  • డిసెంబర్ 26 27 తేదీలలో : ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
  • డిసెంబర్ 29 30 తేదీలలో: డీజిల్ మెకానిక్ ట్రేడ్కు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

సర్టిఫికెట్ల పరిశీలనకు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్:

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాలి.

  1. ఆన్లైన్లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫారం
  2. పదవ తరగతి సర్టిఫికెట్
  3. ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్
  4. ఎన్సివిటి లేదా ఎస్ సి వి టి సర్టిఫికేట్
  5. కుల ధ్రువీకరణ పత్రాలు
  6. ఎన్సిసి సర్టిఫికెట్స్
  7. స్పోర్ట్స్ అర్హతల సర్టిఫికెట్
  8. దివ్యాంగుల పీహెచ్సీ సర్టిఫికెట్
  9. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లు
  10. ఆధార్ కార్డ్
  11. పాన్ కార్డ్
  12. డ్రైవింగ్ లైసెన్స్
  13. నేటివిటీ సర్టిఫికెట్

ఎంత ఫీజు చెల్లించాలి?:

ఏపీఎస్ఆర్టీసీ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద ₹118/- ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును అన్ని కేటగిరీల అభ్యర్థులు చెల్లించవలసి ఉంటుంది.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థల నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page