22,000 పోస్టులతో రైల్వే గ్రూప్ D కొత్త నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 23, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Group D Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 22,000 పోస్టులతో గ్రూప్ డి లెవెల్ 01 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగి, 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. జనవరి 21, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 20, 2026వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఒక్కటే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, ఫిజికల్ టెస్ట్ లు నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కొత్తగా విడుదలైన గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

రైల్వే గ్రూప్-డి నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
విడుదల చేసిన సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్టుల పేరు గ్రూప్ డి లెవెల్ 01 ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు22,000 పోస్టులు
అర్హతలు10వ తరగతి
అప్లికేషన్ ప్రారంభ తేదీజనవరి 21, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు?:

రైల్వే గ్రూప్-డి 22 వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, అభ్యర్థులకు 10వ తరగతి పాసైన విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ అర్హతలు కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

రైల్వే గ్రూప్-డి లెవెల్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. క్యాటగిరిల వారీగా అప్లికేషన్ ఫీజు ఈ క్రింది విధంగా ఉంటుంది.

  • UR, OBC, EWS అభ్యర్థులకు : ₹500/-
  • SC, ST, PWD అభ్యర్థులకు : ₹250/-
  • గ్రూప్ డి పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేస్తారు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల యొక్క ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  5. మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది?:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 45 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల యొక్క ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21st జనవరి, 2026
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 20th ఫిబ్రవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసినవారు అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది నోటిఫికేషన్ అలాగే, అప్లై లింక్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Apply Online

రైల్వే ఉద్యోగాల యొక్క సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page