AP Anganwadi Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మహిళా అభివృద్ధి డిపార్ట్మెంట్ నుండి అంగన్వాడి ఉద్యోగాల భర్తీ కోసం శ్రీ సత్య సాయి జిల్లా నుండి నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 69 అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే స్థానిక జిల్లాకు చెందినటువంటి మహిళ అభ్యర్థులు పదో తరగతి అర్హత కలిగి, 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి ఇప్పుడే వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు :
ఏపీ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి వారి కార్యాలయం |
| పోస్ట్ పేరు | అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు |
| మొత్తం పోస్టులు | 69 పోస్టులు |
| అర్హతలు | 10వ తరగతి |
| ఆఖరు తేది | 30th డిసెంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు పదో తరగతి అర్హత కలిగి, స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర జిల్లాల వారు శ్రీ సత్య సాయి జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
ఎంత వయస్సు ఉండాలి?:
21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ అభ్యర్థులు అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు?:
అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా అన్ని క్యాటగిరిల అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు?:
అంగన్వాడి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులను ఈ క్రింది విధంగా సెలక్షన్ చేస్తారు.
- ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేసి గడువులోగా సబ్మిట్ చేయాలి.
- అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉండదు.
- పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి,
- సొంత గ్రామంలోని అంగన్వాడి పాఠశాలలో పోస్టింగ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 22nd డిసెంబర్, 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ : 30th డిసెంబర్, 2025
ఎంత శాలరీ ఉంటుంది?:
అంగన్వాడి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹6 వేల నుండి ₹12 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఎలా Apply చెయ్యాలి?:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.