Rail Coach Factory Jobs Notification 2025:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాపుర్తల నుండి 550 పోస్టులతో అప్రెంటీషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 10th అర్హతతో పాటు ఐటీ అర్హత కలిగిన వారు ఈ అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ ట్రైనింగ్ ఒక సంవత్సరం కాలం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 12,000 నుండి 15వేల రూపాయల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు?:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుండి విడుదలైన 550 అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాపుర్తల |
| మొత్తం పోస్టులు | 550 |
| అర్హతలు | 10th / 10+2 / ITI అర్హత |
| వయస్సు | 15 నుండి 24 సంవత్సరాలు |
| ఆఖరు తేది | 7th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుండి విడుదలైన అప్రెంటిషిప్ కాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతితో పాటు ఐటిఐ లో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్?:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
- ముందుగా అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్ లిస్టు చేస్తారు.
- అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
అన్ని అర్హతలు ఉన్నవారిని అప్రెంటిషిప్ ట్రైనింగ్ కు తీసుకోవడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు?:
అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ₹100 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు?:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 9th డిసెంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th జనవరి, 2026
ముఖ్యమైన లింక్స్:
ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను వెంటనే సందర్శించండి