High Court Jobs Notification 2025:
ముంబై హైకోర్టు నుండి 2,381 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో స్టెనోగ్రాఫర్, క్లర్క్, స్టాప్ కార్ డ్రైవర్, ప్యూన్ వంటి పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరములు:
ముంబై హైకోర్టు నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ముంబై హైకోర్టు |
| పోస్టుల పేర్లు | స్టెనోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్ , ప్యూన్, క్లర్క్ |
| మొత్తం పోస్టులు | 2,381 పోస్టులు |
| అర్హతలు | పదో తరగతి నుండి డిగ్రీ వరకు |
| ఆఖరి తేదీ | 5th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
హైకోర్టు నుండి విడుదలైన 2,381 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి నుండి డిగ్రీ అర్హత ఉన్నట్లయితే అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర రాష్ట్రాల వారు కూడా నాన్ లోకల్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కావున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
21 నుండి 38 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ముంబై హైకోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించవలెను. అభ్యర్థులు ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి. ఇతర మార్గాల ద్వారా ఫీజు చెల్లించిన అది చెల్లదు.
ఎంపిక విధానం?:
ముంబై హైకోర్టు నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- స్కిల్ టెస్ట్ ఉంటుంది
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు కలిగిన వారికి పోస్టింగ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు?:
ముంబై హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ :15th డిసెంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 5th జనవరి, 2026
ఎంత శాలరీ ఉంటుంది?:
హైకోర్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 35 వేల రూపాయల నుండి 70 వేల రూపాయల వరకు శాలరీలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఇంపార్టెంట్ లింక్స్:
హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది నోటిఫికేషన్ , అప్లికేషన్ ద్వారా వెంటనే అప్లై చేయండి.
కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.