TS High Court Notification 2025:
తెలంగాణ హైకోర్టు నుండి 94 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టులకు 23 నుండి 48 సంవత్సరాల మధ్య వయసు కలిగి, లావు విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు వైవా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా నాన్ లోకల్ లో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చూద్దాము.
పోస్టుల ముఖ్యమైన వివరాలు:
తెలంగాణ హైకోర్టు నుండి విడుదలైన ప్రభుత్వ సివిల్ జడ్జి ఉద్యోగాల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ హైకోర్టు |
| పోస్ట్ పేరు | సివిల్ జడ్జి పోస్టులు |
| మొత్తం పోస్టులు | 94 ( 66 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 28 పోస్టులు ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ ) |
| అర్హతలు | లా డిగ్రీ |
| ఆఖరు తేదీ | 29th డిసెంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగుల అర్హతలు?:
తెలంగాణ హైకోర్టు నుండి విడుదలైన 94 సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ చేసిన వారై ఉండాలి. వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
సివిల్ జడ్జ్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకునే వారికి 23 నుండి 48 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు (EWS, OBC, SC, ST) 05 సంవత్సరాలు, వికలాంగులకు మరో 10 సంవత్సరాలు వయో పరిమితులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు?:
సివిల్ జడ్జ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజును ఆన్లైన్లో చెల్లించవలెను.
- OC, OBC అభ్యర్థులకు:₹1250/-
- EWS, SC, ST, PWD అభ్యర్థులకు: ₹600/-
ఎంత శాలరీ ఉంటుంది?::
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, నెలకు 90,000 వరకు జీతాలు చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా చెల్లిస్తారు.
ఎంపిక చేసే విధానం?:
తెలంగాణ సివిల్ జడ్జి పోస్టులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్
- ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష
- వైవా ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్యమైన తేదీలు?:
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లై చేసుకోవాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 8th డిసెంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 29th డిసెంబర్, 2025
అప్లికేషన్ ప్రాసెస్?:
సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయండి.
- అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ గా అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన లింక్స్?:
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంకోసం మా వెబ్సైట్ ను సందర్శించండి.