TGSRTC Conductor Jobs Notification 2025:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) నుండి ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో ఖాళీగా ఉన్న 63 కండక్టర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. పదో తరగతి అర్హత కలిగి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు, స్థానిక ఖమ్మం జిల్లా నివాసులు అయినట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా అర్హతలు హైట్, లైసెన్స్ వంటి వివరాలను ఆధారంగా చేసుకొని, అర్హులైన అభ్యర్థులకు కండక్టర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18 వేల రూపాయల వరకు జీతాలు చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదివి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
RTC కండక్టర్ పోస్టుల ముఖ్యమైన వివరాలు?:
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి విడుదలైన కండక్టర్ ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ |
| ఉద్యోగం పేరు | కండక్టర్ ఉద్యోగాలు |
| మొత్తం పోస్టులు | 63 |
| అర్హతలు | 10వ తరగతి |
| వయస్సు | 21 నుండి 35 సంవత్సరాలు |
| జీతం | ₹18,000/- |
ఉద్యోగాల అర్హతలు:
TGSRTC నుండి ఖమ్మం ఏడు రీజినల్ డిపోల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ విధానంలో 63 కండక్టర్ పోస్టులను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది?:
తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹17,969/- జీతం చెల్లిస్తారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఎలా ఎంపిక చేస్తారు?:
తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫారంని వెరిఫై చేస్తారు.
- అర్హతలు ఉన్న వారి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు ఉన్నవారికి కండక్టర్గా సంబంధిత డిపోలో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు ఫీజు ఉంటుందా?:
ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరిలో అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి?:
తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన ప్రకటనలో అప్లికేషన్ ఫారం లేనందున,
- అధికారులు అభ్యర్థులను సంబంధిత డిపో కార్యాలయాన్ని సందర్శించాలని,
- అక్కడ అప్లికేషన్ ఫారం తీసుకొని పూర్తి చేసి అక్కడే సబ్మిట్ చేయాలని తెలిపారు.
- అప్లికేషన్ ఫారం తో పాటు అర్హత సర్టిఫికెట్లు మరియు ఇతర కేటగిరి సర్టిఫికెట్లను అటాచ్ చేయాలి.
- అన్ని సర్టిఫికెట్లు ఒక ప్రాపర్ ఫార్మేట్ లో పెట్టి డిపో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన లింక్స్:
తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ పిడిఎఫ్ ని ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విసిట్ చేయండి.