Revenue Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ GST మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి స్పోర్ట్స్ కోటా విధానంలో మొత్తం 20 ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. టాక్సిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు మరియు స్పోర్ట్స్ కోటాలో ఉన్న అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల ముఖ్యమైన వివరాలు?:
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ GST మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలు వివరాలు ఈ క్రింది పట్టికలో చెక్ చేయండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ జిఎస్టి మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ |
| ఉద్యోగుల పేరు | టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ |
| మొత్తం పోస్టులు | 20 |
| అర్హతలు | టెన్త్ , ఇంటర్, డిగ్రీ అర్హత |
| వయస్సు | 18 నుండి 30 సంవత్సరాలు |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల సంఖ్య వివరాలు:
| టాక్స్ అసిస్టెంట్ | 11 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | 01 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 01 |
| హవాల్దార్ | 7 |
| మొత్తం పోస్టులు | 20 |
ఉద్యోగాల అర్హతలు:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 20 ప్రభుత్వ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన మహిళలు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలతో పాటు సంబంధిత క్రీడా విభాగాల్లో యూనివర్సిటీ ఇంటర్నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి, సర్టిఫికెట్ పొందిన వారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితులు మూడు నుండి ఐదు సంవత్సరాలు వరకు సడలింపు కల్పిస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35 వేల రూపాయల నుండి ₹60 వేల రూపాయల వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు ఎంత?:
- ఈ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫారంని షార్ట్ లిస్టు చేస్తారు.
- ఎటువంటి రాత పరీక్ష ఉండదు. స్పోర్ట్స్ ట్రయల్ టెస్టులు నిర్వహిస్తారు.
- అందులో మంచి ప్రతిభ కనబరిచిన వారికి, సర్టిఫికెట్ల పరిశీలన చేసి
- చెన్నైలోని జీఎస్టీ, కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు?:
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ ని తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 8th డిసెంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేది: 7th జనవరి, 2026
ఎలా అప్లై చేయాలి?:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి, గడువులోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.