Muharram Festival Holidays Update:
మొహర్రం పండుగ అంటే ముస్లిం భక్తుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ ఏడాది మొహర్రం పండుగ సెలవు గురించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజల్లో కొంతమేర సందేహం నెలకొంది. అసలు ఈసారి మొహర్రం పండుగ సెలవు ఇస్తారా? ఇస్తే, అది ఏ తేదీన ఇస్తారు?. ఆదివారం రోజు పండుగ వచ్చింది కాబట్టి, మరో రోజు సెలవు ఇస్తారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఈ అంశంపై అధికారిక ప్రభుత్వ సమాచారం ఆధారంగా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మొహర్రం పండుగ 2025 లో ఎప్పుడంటే?:
- 2025లో మొహరం పండుగ తేదీ : జూలై 6, 2025 (ఆదివారం)
- చంద్రుడి దర్శనం ఆధారంగా ఈ తేదీ ఒకరోజు ముందుకి లేదా మరొక రోజు వెనక్కి మారే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ హాలిడే లిస్ట్ ప్రకారం జూన్ 6వ తేదీన మొహరం సెలవుదినంగా ప్రకటించారు.
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఫైనల్ అఫీషియల్ లిస్ట్ వచ్చేసింది: మీ Status చూసుకోండి
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొహరం పండుగ అదనపు సెలవు దినం ఉందా?:
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ సెలవుల లిస్ట్ ప్రకారం జూన్ 6, 2025 మొహరం పండుగ సెలవు దినం ఉంది. అయితే ఆరోజు ఆదివారం రావడంతో, అదనంగా జూలై 7 సోమవారం రోజున సెలవు దినం ప్రకటించలేదు. అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొహరం సెలవు దినం ఆదివారంతోనే ముగుస్తుంది.
ఏపీ ఎంసెట్ పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులందరూ వెంటనే ఈ ఫారం సబ్మిట్ చేయండి
బ్యాంకులు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం ఉందా లేదా?:
- మొహరం పండుగ జూన్ 6 ఆదివారం రోజున రావడం వల్ల, మామూలుగానే అది సెలవు దినం. కానీ అదనంగా ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు స్కూళ్లకు జూలై 7వ తేదీన సెలవు దినం ఇవ్వలేదు. అయితే ఆదివారం రోజు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు గానీ, బ్యాంకులు గానీ, స్కూళ్లు గానీ ఎప్పటిలాగానే మూతబడి ఉంటాయి.
ఏపీ IIIT 2025 రెండవ విడత కౌన్సిలింగ్ డేట్స్ వివరాలు
రాష్ట్రాలవారీగా హాలిడేస్ లిస్ట్ :
| రాష్ట్రాల పేరు | మొహరం తేదీ | హాలిడే రకం | జూలై 7 (అదనపు సెలవు) |
| ఆంధ్ర ప్రదేశ్ | జూలై 6 (ఆదివారం) | పబ్లిక్ హాలిడే | లేదు |
| తెలంగాణ | జూలై 6 (ఆదివారం) | జనరల్ హాలిడే | లేదు |
| జూలై 5 (శనివారం) | ఐచ్చిక హాలిడే |
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వ హాలిడేస్ లిస్టు ప్రకారం జులై 6 మొహరం పండుగ సెలవు దినం. అయితే అదే రోజు ఆదివారం రావడంతో పని దినాలలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదనంగా సెలవు దినాలు ప్రకటించలేదు. కాబట్టి జూలై 7 సోమవారం రోజు ఎటువంటి అదనపు సెలవు ప్రకటించబడలేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ఏదైనా హాలిడేస్ కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి, ఆదివారం కాకుండా మరొక రోజు అదనపు హాలిడే ఆశించకూడదు.