AP పోలీస్ కానిస్టేబుల్ 6,100 పోస్టుల భర్తీ : Big Update |AP Police Constable Recruitment 2024 | Freejobsintelugu

AP Police Constable Recruitment 2024:

2022 లో ఆంధ్రప్రదేశ్ లొని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. మొదటి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించడానికి స్టెప్ 2 ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నారు. తర్వాత 2023లో MLC ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అని కారణాలు చూపుతూ 2023 మార్చి నుండి మే నెల మధ్యన జరగవలసిన ఫిసికల్ ఈవెంట్స్ ని వాయిదావేశారు.

అయితే నోటిఫికేషన్ లో హోం గార్డ్ లకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP లో 25% రిజర్వేషన్ కల్పించడంతో వివాదం మొదలయ్యి కోర్టు కేసులవరకు వెళ్ళింది. ఇప్పుడు 2024 జూన్ లో కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పై దృష్టి సారించి, కోర్టు కేస్ లను పరిష్కరించాలని ప్రయత్నం ఇప్పుడు ఫలించి కోర్టు కేసులు తొలిగిపోయాయి.

ఫిసికల్ ఈవెంట్స్ ఎప్పుడు?:

కానిస్టేబుల్ పోస్టుల న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో మరో 2,3 రోజుల్లో కానిస్టేబుల్ ఫిసికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు.

ప్రిలిమ్స్ లో ఎంత మంది అర్హత పొందారు:?

2023 జనవరిలో జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ద్వారా మొత్తం 5 లక్షల మంది అభ్యర్థులు రాత పరీక్ష రాస్తే అందులో కేవలం 90వేల మంది మాత్రమే ఫిసికల్ ఈవెంట్స్ కి అర్హత పొందారు.

Join Our Telegram Group

కోర్టు కేస్ వివాదం ఏమిటి:?

నోటిఫికేషన్ లో హోం గార్డులకు సివిల్,AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ కల్పించడంతో అధి కోర్టు కేసులవరకు వెళ్ళింది.

కానిస్టేబుల్ పోస్టులు మొత్తం ఎన్ని, వాటి అర్హతలు:

2022 లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,100 పోస్టులతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ప్రకటన విడుదల చేసారు. దరఖాస్తులు స్వీకరించి 2023 లో జనవరిలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత కలిగిన వారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 10వ తరగతి అర్హత కలిగిన అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు.

హైకోర్టులో 300 Govt జాబ్స్ విడుదల : 10th అర్హత

మెయిన్స్ రాత పరీక్షలు ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం మొదటగా ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత ఫిసికల్ ఈవెంట్స్ ఆ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ పరీక్ష మాత్రమే పూర్తి అయ్యింది. అందులో అర్హత సాధించినవారికి మరికొన్ని రోజుల్లో ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈవెంట్స్ లో అర్హత పొందినవారికి మెయిన్స్ రాత పరీక్ష పెట్టి మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారు.

AP జిల్లా ఉపాధి కార్యాలయంలో 550 పోస్టులు భర్తీ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

కానిస్టేబుల్ ఉద్యోగాలు 3 దశల్లో చేస్తారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1). ప్రిలిమినరీ రాత పరీక్ష

2). ఫిసికల్ ఈవెంట్స్

3). మెయిన్స్ రాత పరీక్ష

మరో 20,000 పోస్టులు?:

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న మరో 20వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మినిస్టర్ అనిత గారు గతంలో తెలిపారు.

ఈరోజు ఈ ఉద్యోగాల భర్తీకి సంబందించి వచ్చిన పూర్తి సమాచారం ఈ క్రింది PDF లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు

Recruitment Update : PDF

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్, పోలీస్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సమాధార్శించండి.

Leave a Comment

error: Content is protected !!