TSPSC గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు – Final Results 2024| Tspsc Group 4 Results 2024 | Tspsc Group 4 Cut Off Marks 2024

Tspsc Group 4 Results 2024:

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 8,000+ పోస్టులకు సంబందించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసినది. ఇందులో భాగంగా ఈరోజు TSPSC  గ్రూప్ 4 జిల్లాలవారీగా ఉన్నటువంటి Revised ఖాళీల లిస్ట్ కూడా Official గా విడుదల చెయ్యడం జరిగింది.

ఈ revised vacancy లిస్ట్ లో మనకు పోస్టుల వారీగా మరియు జిల్లాలవారీగా, కేటగిరీల వారీగా ఎవరికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో tspsc official ఖాళీల లిస్ట్ ద్వారా తెలుపడం జరిగింది.

మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం. 19/2022)కు సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహి ళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

Changes In Tspsc Group 4 Recruitment 2024:

తెలంగాణలో గ్రూప్-4 నియామకాలకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసు కున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని రద్దుచేస్తూ టీఎస్ పీఎస్సీ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అధికారిక వెబ్సైటులో అప్లోడ్ చేసింది. రోస్టర్ ఉప సంహరణతో ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే పూర్తి వివరాలు https://websitenew.tspsc.gov.in/ Website లో ఉంచారు.

Join Our Telegram Group

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను 9 ఫిబ్రవరి 2024న TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల చేసింది. ఫలితాలను చెక్ చేసుకోని అభ్యర్థులు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 Results PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆపై వారి రోల్ నంబర్‌ను శోధించడం ద్వారా అభ్యర్థులు వారి ఫలితాలు మరియు మొత్తం మార్కులను తనిఖీ చేయవచ్చు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా దిగువ భాగస్వామ్యం చేసిన డైరెక్ట్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలిత PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tspsc Group 4 – 1:2 Selection List:

తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ revised ఖాళీల లిస్ట్ విడుదల చేసినది కనుక 2 నుండి 5 రోజుల్లోపు మనకు 1:2 జాబితాతో కూడిన లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కావున అభ్యర్థులు TSPSC Official వెబ్సైటుని ప్రతి రోజూ visit చేసి check చేసుకోవాలి. 1:2 జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు సంబందిత డిపార్ట్మెంట్ లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది.

TSPSC Group 4 Qualifying Marks:

TSPSC గ్రూప్ 4 పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి.
TSPSC గ్రూప్ 4 క్వాలిఫైయింగ్ మార్కుల వివరాలు OC, Sportsmen, Ex-servicemen & EWS – 40%, BCs – 35% – SCs, STs, and PH – 30% మార్క్స్ వచ్చినవారు అర్హత సాధిస్తారు. కానీ మంచి మెరిట్ మార్కులు వచ్చినవారు మాత్రమే జాబ్ పొందుతారు.

Tspsc Group 4 : GRL List

District Wise Breakup Of Vacancy List

Tspsc Website

Join Our Telegram Group

1 thought on “TSPSC గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు – Final Results 2024| Tspsc Group 4 Results 2024 | Tspsc Group 4 Cut Off Marks 2024”

Leave a Comment

error: Content is protected !!