AP DME Notification 2024:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి గవర్నమెంట్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్ లో పని చెయ్యడానికి 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా సంబంధిత అర్హతల్లో మెరిట్ మార్కులు కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులకు మాత్రమే అర్హత కల్పిస్తున్నారు, నాన్ లోకల్ అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్ లో 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ఉద్యోగాల వివరాలు, అర్హతలు:
• అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ స్పెషలిస్ట్ (క్లినికల్ & నాన్ క్లినికల్): పీజీ డిగ్రీలో (MD/MS/DNB/DM) చేసినవారు అర్హులు.
• అసిస్టెంట్ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిటీస్: పీజీ డిగ్రీలో (MD/MS/DNB/DM) చేసినవారు అర్హులు.
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
శాలరీ (పే స్కేల్):
7th UGC నియమాల ప్రకారం జీతంతో పాటు ₹30,000/- అలవెన్స్ లు చెల్లిస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
01.07.1982 తర్వాత పుట్టిన UR అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 18 నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాల వయస్సు ఉన్నా అప్లై చేసుకోవచ్చు.
10,954 VRO ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్
సెలక్షన్ ప్రాసెస్:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఉద్యోగాలు ఇస్తారు.
మొత్తం 100 మార్కులకు సెలక్షన్ చేస్తారు, ఇందులో
• 75 మార్కులు అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు
• 10 మార్కులు అర్హత తర్వాత కలిగి ఉన్న అనుభవం బట్టి కేటాయిస్తారు.
• 5 మార్కులు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు.
• మిగిలిన మార్కులు గతంలో పని చేసినవారికి కేటాస్తారు.
AP వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు:
OC అభ్యర్థులు ₹1,000/- ఫీజు చెల్లించాలి. SC, ST, OBC, EWS, PHC అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విధానంలో ఫీజు చెల్లించినచో అంగీకరించబడదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
• లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
• ssc మార్క్స్ సర్టిఫికెట్
• 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్
• ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ సర్టిఫికెట్
• MBBS సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్
• AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
• అనుభవం ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
పైన తెలిపిన డాక్యుమెంట్స్ కలిగినవారు ఆన్లైన్ లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.
11,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
ఎలా అప్లై చెయ్యాలి, ఆఖరి తేదీ:
23.08.2024 నుండి 09.09.2024 మధ్య అర్హత కలిగిన అభ్యర్థులు https://dme.ap.nic.in వెబ్సైటు నందు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.