AP Agriculture Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 02 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చెయ్యడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. B.Sc చేసి 2 సంవత్సరాల ఫీల్డ్ అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. పురుషులు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగినవారు అర్హులు, మహిళలు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు. 30.08.2024 న ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూ చేసి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి.
ప్రకటన అర్హతలు, వయస్సు వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు BSC చేసి 2 సంవత్సరాల ఫీల్డ్ అనుభవం కలిగినవారు అర్హులు. కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
కాంట్రాక్ట్ కాలపరిమితి:
ఎంపిక కాబడిన అభ్యర్థులు 11 నెలలు పాటు (మరెటేరులోని, రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నందు ఉన్న ‘AICRIP On RICE ‘ అనే ప్రాజెక్ట్ లో )పని చెయ్యాలి, వ్యవసాయ శాఖవారు ఉద్యోగుల అవసరాన్ని బట్టి మీ కాంట్రాక్ట్ కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంది.
ఎంత జీతం ఉంటుంది?
నెలకు గౌరవ వేతనంగా ₹18,500/- చెల్లిస్తారు. ఎటువంటి TA, HRA, DA వంటి అలవెన్స్ లు ఉండవు.
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
30.08.2024 న మరెటేరులోని RARS నందు ఉన్న అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆఫీస్ నందు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
AP విద్యుత్ శాఖ(EPDCL) లో ఉద్యోగాలు
ఇతర నియమ నిబంధనలు:
• ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA/DA చెల్లించబడదు.
• పైన తెలిన పోస్టులన్నీ తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు.
• అర్హత కలిగిన అభ్యర్థులు వారికి సంబందించిన మార్క్స్ లిస్ట్స్, ఇతర డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి.
• ఖాళీ పేపర్ పై మీ బయో డేటా మరియు 02 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి
• ఇంటర్వ్యూకి వచ్చినవారిని సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
పూర్తి నోటిఫికేషన్ వివరాలు, ఇతర సమాచారం కోసం ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలకోసం మా వెబ్సైటు Freejobsintelugu ni ప్రతి రోజూ సందర్శించండి.