AP WDCW Notification 2026:
ఏపీ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పోలవరం జిల్లా నుంచి 13 పోస్టులతో కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్,కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, మల్టీ పర్పస్ స్టాప్, సోషల్ కౌన్సిలర్, పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి, పదవ తరగతి లేదా డిప్లమా లేదా డిగ్రీ అర్హతలు కలిగిన వారు, సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు:
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన పోస్టుల వివరాలు.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పోలవరం జిల్లా |
| పోస్టుల పేర్లు | సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్,కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, మల్టీ పర్పస్ స్టాప్, సోషల్ కౌన్సిలర్, పారామెడికల్ స్టాఫ్ |
| మొత్తం పోస్టులు | 13 |
| అర్హతలు | పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ |
| లాస్ట్ డేట్ | మార్చి 16, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన 13 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే నిరుద్యోగ అభ్యర్థులకు 10వ తరగతి లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు నుండి మూడు సంవత్సరాలు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు మహిళా అభివృద్ధి సంస్థ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఏపీ మహిళాభివృద్ధి సంస్థ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹13000 నుండి ₹34000 రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
ఎంపిక విధానం:
ఏపీ మహిళాభివృద్ధి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పంపించాలి
- అప్లై చేసుకున్న వారికి పరీక్షలు లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ద్వారా గడువులోగా పంపించవలెను
ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:
| నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం | Download |
| దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ | మార్చ్ 16, 2026 |
| అఫీషియల్ వెబ్సైట్ | Click Here |
ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలయ్య ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.