Telangana District Court Jobs Notification 2026:
తెలంగాణలోని జిల్లా కోర్టులో పనిచేయడానికి 858 పోస్టులతో కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయి . ఈ ఉద్యోగాలకు ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆఫ్లైన్ విధానంలో ప్రాంత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.
నోటిఫికేషన్స్ సమాచారం:
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం ఈ క్రింది వాటిలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ డిస్ట్రిక్ట్ జ్యుడీషియల్ |
| పోస్టుల పేర్లు | జూనియర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్ |
| మొత్తం పోస్టులు | 858 |
| అర్హతలు | 7th, 10th, ఇంటర్, డిగ్రీ |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 13, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
తెలంగాణ జిల్లా కోర్టుల నుండి విడుదలైన 858 ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం ఎంత?:
ఈ కోర్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹35 వేల రూపాయల నుండి ₹65 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది ఫీజులను కేటగిరీల వారీగా చెల్లించవలెను.
- OC, BC అభ్యర్థులకు ₹600/- ఫీజు
- SC, ST అభ్యర్థులకు ₹400/- ఆన్లైన్ ఫీజు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- 80 మార్కులకు OMR విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు
- 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
- అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు
ముఖ్యమైన తేదీలు:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 24, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ | ఫిబ్రవరి 13, 2026 |
| పరీక్ష నిర్వహించే తేదీ | తేదీలు వెల్లడించలేదు |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్లి, అన్ని అర్హతలు ఉన్నవారు నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.