AP District Collector Office Jobs:
ఆంధ్రప్రదేశ్ లోని కలెక్టర్ ఆఫీస్, విశాఖపట్నం జిల్లా నుండి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు డిగ్రీలో BSC, BCA, BE, BTECH, MTECH తో పాటు ఇంగ్లీష్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, గేజెట్టెడ్ ఆఫీసర్స్ తో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ పై సంతకం చేయించినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు, అర్హతలు:
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. బాచిలర్స్ డిగ్రీలో BSC, BCA, BE, BTECH, MTECH తో పాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ విధానలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి 04.11.2024 ఆఖరు తేదీ. Visakhapatnam.ap.gov.in వెబ్సైటులో ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ హార్డ్ కాపీని, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ని కలిపి విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కి పోస్ట్ ద్వారా పంపించాలి.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు డిపార్ట్మెంట్ వారు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి మెరిట్ చూపించినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి :
21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి. 01.07.2022 నాటికీ ఈ వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
శాలరీ ఎంత ఉంటుంది:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹22,500/- ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP జిల్లా E కోర్టుల్లో ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయవల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక, ప్రింటెడ్ అప్లికేషన్ ని కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.