Union Bank Of India Notification 2024:
ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మొత్తం 25 రాష్ట్రాల్లో 570 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబందించిన లోకల్ భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్ధ చేసుకోవడం వచ్చి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్ష నిర్వహించి అందులో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు అప్రెంటీస్ అవకాశం గా కల్పిస్తారు. ఈ అప్రెంటీస్ ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 28th ఆగష్టు 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 17th సెప్టెంబర్ 2024
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకునే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులలో
జనరల్ / OBC అభ్యర్థులు : ₹800/- + GST ఫీజు చెల్లించాలి
మహిళలందరు : ₹600/- + GST ఫీజు చెల్లించాలి
SC/ST అభ్యర్థులు : ₹600/- + GST ఫీజు చెల్లించాలి
PWD అభ్యర్థులు : ₹600/- + GST ఫీజు చెల్లించాలి.
అర్హతలు, వయస్సు వివరాలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
మొత్తం ఎన్ని పోస్టులు:
570 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు. అర్హత కలిగిన భారత పౌరులందరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 100 ప్రశ్నలతో 100 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ ఫైనాన్సియల్ అవేర్నెస్, కంప్యూటర్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. 60 నిముషాలు సమయం కేటాయిస్తారు.
ట్రైనింగ్ సమయం, స్టైపెండ్ వివరాలు:
అప్రెంటీస్ లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు. ఎటువంటి అలవెన్స్ లు, TA, DA, HRA వంటి సదుపాయలు ఉండవు.
లోకల్ భాషపై అవగాహన :
అభ్యర్థులు అప్లై చేసుకునే రాష్ట్రానికి సంబందించిన లోకల్ భాష చదవడం, రాయడం రావాలి. దానికి సంబందించిన సర్టిఫికెట్స్ ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిట్ చెయ్యాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు స్వీకారుస్తారు. వేరే విధానంలో అప్లై చేసినవారి అప్లికేషన్స్ తిరస్కరించబడతాయి.
జాబ్ పోస్టింగ్:
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. సంవత్సరం పాటు పని చేసిన తర్వాత ట్రైనింగ్ చేసినందుకుగానూ బ్యాంక్ వారు మీకు సర్టిఫికెట్ ఇచ్చి శిక్షణ పూర్తి చేస్తారు.
ఫలితాలు ఎలా చూసుకోవాలి :
ఫలితాలు విడుదల చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైటులో చెక్ చేసుకోవాలి.
బ్యాంక్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా Freejobsintelugu వెబ్సైటుని సందర్శించండి.