తెలంగాణాలో పరీక్ష లేకుండా Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు | OFMK Notification 2024 | Freejobsintelugu

తెలంగాణాలోని మెదక్ జిల్లా ఆర్డినన్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో 86 జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, డిగ్రీలోని పలు విభాగాల్లో అర్హతలు కలిగి 3 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత offline లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

తెలంగాణా మెదక్ జిల్లాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ నుండి 86 పోస్టులతో కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేసారు.

జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగి అనుభవం కూడా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవలెను.

Join Whats App Group

ముఖ్యమైనా తేదీలు:

ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయిన తేదీ నుండి 21 రోజులలోగా అప్లికేషన్ ఫారంను సంబందించిన డిపార్ట్మెంట్ కి పోస్ట్ ద్వారా పంపవలెను. నోటిఫికేషన్ విడుదలయిన తేదీ 11th నవంబర్ 2024.

విద్యుత్ సరఫరాల సంస్థలో ఉద్యోగాలు : 950 పోస్టులు

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హతలు, అనుభవం ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసుకొని 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹21,000/- నుండి ₹30,000/- జీతాలు చెల్లిస్తారు. ఫిక్స్టెడ్ టర్మ్ కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఉండవు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. SBI కలెక్ట ద్వారా పేమెంట్ చెయ్యాలి. SC, ST, PWD, Ex Servicemen, Female అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, వారికి మినహాయింపు ఉంటుంది.

రైల్వేలో కొత్తగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు : 10th, 12th అర్హత

అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్:

ది డిప్యూటీ జనరల్ మేనేజర్ /HR, ఆర్డినన్స్ ఫ్యాక్టరీ మెదక్,సంగారెడ్డి, తెలంగాణా,502205

కావలిసిన డాక్యుమెంట్స్ ఇవే:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

Official Website

తెలంగాణాలోని ఆర్డినన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!