Telangana Govt Jobs 2024:
తెలంగాణా ప్రభుత్వం జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మరో 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి D.ఫార్మసీ, బి. ఫార్మసీ, ఫార్మా.డి పూర్తి చేసిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష పెట్టి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్య తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 05.10.2024
ఆన్లైన్ అప్లికేషన్ అఖరు తేదీ : 21.10.2024
రాత పరీక్ష తేదీ : 30th నవంబర్ 2024
ఆన్లైన్ లోనే దరఖాస్తులు అంగీకరిస్తారు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
633 ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణా మెడికల్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. డి. ఫార్మసీ, బి. ఫార్మసీ, ఫార్మా. డి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు.
అటవీ శాఖలో ఉద్యోగాలు : Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
మొత్తం 100 మార్కులకు సెలక్షన్ చేస్తారు. ఇందులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి జాబ్స్ ఇస్తారు. మిగిలిన 20 మార్కులకు అనుభవం కలిగినవారికి కేటాయిస్తారు. మొత్తంగా 100 మార్కులలో మంచి మెరిట్ మార్కులు వచ్చినవారికి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఇస్తారు.
10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి. కావున అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొని రాత పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించండి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
ఆధార్ కార్డు, Ssc 10th క్లాస్ మార్క్స్ లిస్ట్,
డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆఫ్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్.
1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి అర్హతలు కలిగి ఉంటే గడువులోగా దరఖాస్తుకు చేసుకోగలరు.
తెలంగాణా ఫార్మసీ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.