Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణా ప్రభుత్వం నుండి జనగామ జిల్లాలోని మెడికల్ కాలేజ్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానములో ల్యాబ్ అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, టెక్నీషియన్, గాస్ ఆపరేటర్, దోబీ, వార్డ్ బాయ్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పలు రకాల ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ / కంప్యూటర్ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, ప్లంబర్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, దోబీ, థియేటర్ అసిస్టెంట్, వార్డ్ బాయ్, గ్యాస్ ఆపరేటర్ ఉద్యోగాలకు 10th, ఇంటర్మీడియట్ అర్హత కలిగి అదనంగా సంబందించిన విభాగాల్లో కూడా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు :
22,750/- వరకు పోస్టులను అనుసరించి ఉద్యోగాలు ఇస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు
ఎంపిక విధానం:
జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు
దరఖాస్తు వివరాలు:
14th సెప్టెంబర్ నుండి 21st సెప్టెంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోవాలి. ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
OC, OBC అభ్యర్థులు ₹200/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది.
10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్,
లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ (SC, ST, OBC, EWS)
4th నుండి 10th వరకు ఉన్నా స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ ఫీజు Receipt
ఇతర అన్ని డాక్యుమెంట్స్ కలిపి దరఖాస్తులు గడువులోగా పంపించాలి.
విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ లో 478 ఉద్యోగాలు
ఎలా Apply చేసుకోవాలి:
అన్ని జిల్లాలవారు లోకల్, నాన్ లోకల్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లికేషన్స్ పెట్టుకోగలరు
Notification PDF & Application Form
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటును సందర్శించండి.