TS Outsourcing Jobs 2024:
తెలంగాణాలోని జగిత్యాల జిల్లా నుండి 09 మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్ స్టాఫ్ నర్స్, MBBS డాక్టర్ జాబ్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా GNM నర్సింగ్, BSC నర్సింగ్, Mbbs చేసిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లై చేసే ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13th నవంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 18th నవంబర్ 2024.
ఆఫ్ లైన్ విధానంలో పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్, జగిత్యాల జిల్లాకు పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా జగిత్యాల జిల్లా నుండి కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో 09 MLHP పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. GNM నర్సింగ్, BSC నర్సింగ్, MBBS చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి.
రోడ్డు రవాణా శాఖలో 466 Govt జాబ్స్: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. మంచి మెరిట్ మార్కులు ఉంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి టెంపరరీ విధానంలో డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటారు.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారికి Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు
శాలరీ వివరాలు:
కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ పోస్టులకు ₹29,000/- శాలరీ, MBBS డాక్టర్ ఉద్యోగాలకు నెలకి ₹40,000/- శాలరీ ఉంటుంది. ఇతర వేరే బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్:
SSC, ఇంటర్మీడియట్, GNM, BSC స్టాఫ్ నర్స్, Mbbs సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టట్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి..
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.
విద్యుత్ సరఫరాల సంస్థలో 950 Govt ఉద్యోగాలు : అప్లై
ఎలా అప్లై చేసుకోవాలి:
అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.