తెలంగాణాలో 600 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ | Telangana ESI Notification 2024 | Freejobsintelugu

Telangana ESI Notification 2024:

తెలంగాణాలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలో 600 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి అని ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 18 ననుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణా ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన 600 ఉద్యోగాలలో సివిల్ సర్జన్ 124 పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 07 పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులు 272 పోస్టులు, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 99 పోస్టులు, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 34 పోస్టులు, నర్సింగ్ మిడ్ వైఫ్ 54 పోస్టులు, రేడియోగ్రఫర్ 05 పోస్టులు, డెంటల్ టెక్నీషియన్ 05 పోస్టులు, ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ ఒక్కో పోస్టు చొప్పున విడుదల చెయ్యడం జరిగింది.

మెడికల్ విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ అర్హతలు పోస్టులను అనుసరించి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. Sc, st, obc, ews అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ఏపీలో అన్ని జిల్లాలలవారికి గవర్నమెంట్ జాబ్స్: Any డిగ్రీ

శాలరీ ఎంత ఉంటుంది:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 18,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ డేట్స్:

తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతానికి ఆర్ధిక అనుమతి మాత్రమే ఇవ్వడం జరిగింది. 600 పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు.

తెలంగాణాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు : కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్ లో సూచించిన విధంగా దరఖాస్తులు చేసుకోవాలి.

Notification vacancy Details

తెలంగాణాలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!