Telangana Electrical Department Notification 2024:
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,000 పోస్టుల భర్తీకి వచ్చే నెల అక్టోబర్ లో రిక్రూట్మెంట్ చెయ్యడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖలో 3,000 పోస్టుల భర్తీ అనుమతి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లైన్ మ్యాన్ వంటి పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూసి దరఖాస్తు చేసుకోండి.
ఎటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు:
తెలంగాణలోని విద్యుత్ పంపిణీ డిస్కంలంజే, ట్రాన్స్ కో లలో ఖాళీగా ఉన్న కింద స్థాయి పోస్టులయినటివంటి అసిస్టెంట్ లైన్ మ్యాన్, జూనియర్ లైన్ మ్యాన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్ తో మిగిలిన అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు.
అర్హతలు ఏమీ ఉండాలి :
గుర్తింపు కలిగిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లలో ITI, డిప్లొమా ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిగ్రీ చేసినవారు అర్హులు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ వంటి పలు అంశాల్లో అర్హతలు కలిగినవారు అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ విధానం:
తెలంగాణా విధ్యుత్ పంపిణీ సంస్థ వారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
ప్రభుత్వ. కళాశాలలో అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలు: Govt జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
రాష్ట్ర ప్రభుత్వం నుండి పోస్టిలను అనుసరించి కనీసం ₹25,000/- నుండి ₹50,000/- వరకు జీతం ఉంటుంది. TA, DA, HRA వంటి ఇతర అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు.
సిలబస్ వివరాలు:
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల ప్రశ్నలతోపాటు అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇస్తారు. ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో 345 గవర్నమెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
డిస్కమ్ లలో ఎక్కువగా పాదోన్నతులు జరిగిన నేపథ్యంలో చాలావరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను పూరించడానికి వచ్చే నెలలో 3వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ చేసి రిక్రూట్మెంట్ చెయ్యాలి అని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణా జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలలో ఖాళీ పోస్టులు ఉన్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్స్ విడుదల చేశాక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
తెలంగాణా విద్యుత్ శాఖ ఖాళీల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.