Railway Recruitment 2024:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నార్త్ర్న్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నుండి 7,400 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 10th + ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ₹100/- ఫీజు చెలిస్తే చాలు.10th, ITI లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ సెలక్షన్ చేస్తారు. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
అర్హతలు, వయస్సు వివరాలు:
15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. 10వ తరగతి అర్హత కలిగి ITI లో సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
₹100/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
సెలక్షన్ ప్రాసెస్:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th, ITI లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మంచి మార్కులు ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
పోస్టల్ శాఖ మరో కొత్త నోటిఫికేషన్ : 10th అర్హత
స్టైపెండ్ ఎంత ఇస్తారు:
రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగులుగా ఎంపిక అయినవారికి నెలకు ₹10,000/- నుండి ₹15,000/- మధ్య స్టైపెండ్ ఇస్తారు. ఇతర వేరే అలవెన్స్ లు ఏమీ ఉండవు.
నీటిపారుదల శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
మొత్తం ఎన్ని పోస్టులు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నార్త్ర్న్ రైల్వే నుండి 4096, వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 3,317 పోస్టులకు అప్రెంటీస్ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఒక సంవత్సరంపాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ తో పాటు ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు తేదీలు
నార్త్ర్న్ రైల్వే ఆఖరు తేదీ : 16/09/2024
వెస్ట్ సెంట్రల్ రైల్వే ఆఖరు తేదీ : 04/09/2024
ఎలా అప్లై చెయ్యాలి:
RRC NR, WCR వెబ్సైటులోకి వెళ్లి ఆన్లైన్ లో పైన తెలిపిన తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
RRC NR Notification Apply Online
RRC WCR Notification Apply Online
రైల్వే శాఖ నుండి విడుదలయ్యే ఉద్యోగాలకు సంబందించిన సమాచారంకోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందదర్శించండి.