Railway Notification 2024:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి గతంలో విడుదల చేసిన రైల్వే టెక్నీషియన్ 9,144 పోస్టులను 14,298 పోస్టులకు పెంచుతూ ఈరోజు అధికారికంగా నోటీసు విడుదల చెయ్యడం జరిగింది. పెంచిన ఈ 14,298 పోస్టులకు కొత్త అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవచ్చని నోటీస్ లో పేర్కొన్నారు. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టి 15 రోజుల్లో అప్లికేషన్ పెట్టుకునే విధంగా సమయం ఇస్తారు. 10th, ITI, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కావున పూర్తి వివరాలు చూసి అప్లై చెయ్యండి.
టెక్నీషియన్ పోస్టుల వివరాలు:
రైల్వేలో ఖాళీగా ఉన్న 9,144 టెక్నీషియన్ పోస్టులను 14,298 (టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3) పోస్టులకు పెంచుతూ రైల్వే శాఖవారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులకు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
ఎంత వయస్సు ఉండాలి?:
01.07.2024 నాటికి 18-36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే నియమాల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC, EWS అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
ఉండవలసిన అర్హతలు:
టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 10వ తరగతి అర్హతతో పాటు ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. డిగ్రీ పాస్ అభ్యర్థులకు కూడ కొన్ని పోస్టులకు అవకాశం కల్పిస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు ఎంత:
UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
SC, ST, మహిళలు, PWD, ట్రాన్స్ జెండర్స్, EBC, Ex సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అటెండ్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఫీజు రిఫండ్ చెయ్యడం జరుగుతుంది.
తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు: 10th అర్హత
రిక్రూట్మెంట్ ప్రాసెస్:
మొదటగా అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 90 నిముషాల్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 1/3rd నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. తెలుగు భాషలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. తర్వాత మెడికల్ ఎక్సమినేషన్ ద్వారా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయి
జనరల్ అవేర్నెస్ : 10 ప్రశ్నలు
జనరల్ ఇంటలిజెన్స్ & రీసనింగ్ : 15 ప్రశ్నలు
బేసిక్ కంప్యూటర్స్ & అప్లికేషన్స్ : 20 ప్రశ్నలు
మాథమాటిక్స్ : 20 ప్రశ్నలు
బేసిక్ సైన్స్ & ఇంజనీరింగ్ : 35 ప్రశ్నలు
AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు: No Exam
ఎలా అప్లై చేసుకోవాలి:
టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి రైల్వే డిపార్ట్మెంట్ వారు మరో 15 రోజుల్లో అవకాశం కల్పిస్తారు. అప్పుడు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు
రైల్వే ఉద్యోగాల సమాచారం కోసం మ వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.