AP Inter Results 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సరం 2024 లో ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను ఏప్రిల్ 12 న విడుదల చేశారు. ఈ సంవత్సరం కూడా అదే సమయానికి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది అని విద్యార్థులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు రాసి ఉన్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకం కూడా పూర్తి చేసి త్వరగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
ఫలితాలు విడుదల ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు Ap మొదటి, 2వ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా ఏప్రిల్ 12వ తేదీలోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్ని పేపర్స్ మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తారు.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam
వాట్సాప్ లో ఫలితాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి వినూత్నంగా వాట్సాప్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థులు వాట్సాప్ లోనే ఫలితాలు చూసుకోవచ్చు.
సప్లీమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల యొక్క పరీక్షలను జూన్ 2025 లో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగ అధికారులు తెలిపారు. ఫెయిల్ అయిన లేదా మెరిట్ పెంచుకునే విధంగా చూసే అభ్యర్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి ఆ పరీక్షలకు మళ్ళీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని బోర్డు ఆఫీసర్స్ నుండి సమాచారం.
తెలంగాణాలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
ఫలితాలు ఎలా చూడాలి?:
ఫలితాలు చూసుకోవడం కోసం అధికారిక వెబ్సైటు bieap.apcfss.in లేదా resultsbie.ap.gov.in ని విజిట్ చెయ్యాలి.
వెబ్సైటులో Ap 1st ఇయర్ లేదా 2nd ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్స్ పై క్లిక్ చెయ్యాలి.
అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి
అప్పుడు అభ్యర్థులు ఫలితాలు స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది.
వచ్చిన ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తిడుకొనవలెను.
ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫలితాలను చూసుకోగలరు.