AP DSC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 16,347 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ dsc ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10+2 / డిగ్రీ అర్హత కలిగి టెట్ రాత పరీక్షలో అర్హత పొంది, D. Ed లేదా B. Ed చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ లోని పూర్తి సమాచారం చూసి తెలుసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 6th నవంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 6th డిసెంబర్ 2024
రాత పరీక్షలు నిర్వహించే తేదీ: ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగి D.Ed, B. Ed పూర్తి చేసి టెట్ పరీక్షలో కూడా అర్హత పొందినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
TTD అన్నప్రసాదం ట్రస్ట్ బోర్డులో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
పోస్టులవారీగా ఖాళీల లిస్ట్:
మెగా Dsc లో భాగంగా 16,347 పోస్టులను భర్తీ చేస్తుంటే ఇందులో SGT లు 6,371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 7,725 పోస్టులు, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52, PET 132 పోస్టులు ఉన్నాయి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు సొంత జిల్లా కేంద్రంలో ఒక్క రాత పరీక్ష నిర్వహించడం ద్వారా, పరీక్షలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధంగా దరఖాస్తు రుసుము చెల్లించవలెను. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో కొంత తగ్గింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి TA, DA, HRA వంటి ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Income Tax Dept. లో ఉద్యోగాలు : Apply
జిల్లా మొత్తానికి ఒకేటే పరీక్ష:
dsc పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహిస్తున్నందున ఒకరోజు ఆన్లైన్ లో ఒక జిల్లాలో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ DSC ఉద్యోగాలకు అర్హత కలిగినవారు నోటిఫికేషన్, apply లింక్స్ ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు.
AP dsc ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.