Telangana Muncipal Dept. Notification 2024:
తెలంగాణా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులతోపాటు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. త్వరలో తెలంగాణా ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. పోస్టుల పూర్తి వివరాలు చూడండి.
భర్తీ చేసే పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్స్ : 07 పోస్టులు
గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్లు : 43 పోస్టులు
గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు : 41 పోస్టులు
హెల్త్ ఆఫీసర్స్ : 07 పోస్టులు
రెవెన్యూ మేనేజర్స్ : 11 పోస్టులు
శానిటరీ సుపర్వైసోర్స్ : 10 పోస్టులు
శానిటరీ ఇన్స్పెక్టర్ : 86 పోస్టులు
హెల్త్ అసిస్టెంట్స్ : 96 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ : 15 పోస్టులు
APSRTC లో 3 జిల్లాలో ఉద్యోగాలు: No Exam, No Fee
ఉండవలసిన అర్హతలు:
మున్సిపల్ శాఖలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
అప్లికేషన్ చేసుకోవడానికి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ISRO లో పరీక్ష లేకుండా 585 ఉద్యోగాలు భర్తీ : Apply
ఎంపిక విధానం ఎలా చేస్తారు:
పురపాలక శాఖలోని పోస్టులను భర్తీ చేయడానికి రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పరీక్ష పెట్టి, తర్వాత అదే జిల్లాలో పోస్టింగ్ కూడా ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అలాగే ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
RTC లో మరో 7,545 ఉద్యోగాలు భర్తీ : Apply
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
తెలంగాణా ప్రభుత్వం శనివారం రోజున పోస్టుల భర్తీకి మున్సిపల్ శాఖలో ఉన్న 316 పోస్టులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తెలంగాణా జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ పోస్టులకు సంబందించి నోటిఫికేషన్ మరి కొద్ది రోజులలో విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణా తపాలాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు: No Exam
రిక్రూట్మెంట్ డీటెయిల్స్:
316 మున్సిపల్ ఖాళీలకు సంబందించిన పూర్తి సమాచారం ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
తెలంగాణాలోని మున్సిపల్ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.