APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు జిల్లాల నుండి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుండి పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th అర్హతతోపాటు సంబందించిన ట్రేడ్స్ లో అప్రెంటీస్ పూర్తి చేసినవారికి అవకాశం ఉంటుంది. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
Apsrtc నుండి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ఉద్యోగాలను అప్రెంటీస్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 10th అర్హతతోపాటు ITI అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థుకు అప్లికేషన్ చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
ఇస్రోలో 585 పోస్టులకు నోటిఫికేషన్ : No Exam , No Fee
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 3 జిల్లాలకు సంబందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
శాలరీ / స్టైపెండ్ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹8,000/- నుండి ₹12,000/- వరకు ప్రతి నెల జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.
APSRTC లో 7,545 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply
ఆన్లైన్ అప్లికేషన్ విధానం:
ITI పూర్తి చేసిన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైటు నందు మీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ పూర్తి చేసుకొని, అక్టోబర్ 31st తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 8న, ఉదయం 10 గంటలకు విజయనగరంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో హాజరు కావలెను.
TS నీటి పారుదల శాఖలో 1878 ఉద్యోగాలు : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
10వ తరగతి మార్క్స్ మెమో ఉండాలి.
ITI ట్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో ఇచ్చిన 3 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.