APSDPS Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి 13 పోస్టులతో రాత పరీక్ష పెట్టి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి మంచి అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 16th అక్టోబర్ 2024
అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 29th అక్టోబర్ 2024
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్, ప్లానింగ్ సొసైటీ నుండి 13 పోస్టులతో ప్రోగ్రామ్ / ప్రాజెక్ట్ మేనేజర్, కన్సల్టెంట్, డేటా బేస్ డెవలపర్ ఉద్యోగాలకు సంబందించి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత రాష్ట్రంl9 రాజధాని ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీం : 80,000 ఉద్యోగాలు
ఎంత శాలరీ ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 45,000/- నుండి ₹75,000/- వరకు జీతాలు ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింద ఉన్న సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
రెసిడెన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అప్లికేషన్స్ చేసుకోగలరు.