MANUU Recruitment 2024:
హైదరాబాద్ లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగ ప్రకటనలో వర్క్ షాప్ అటెండర్, లైబ్రరీ అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు, దరఖాస్తు ఆఖరు తేదీ:
31.08.2024 తేదీలోగా అర్హత కలిగిన అభ్యర్థులు మొదటగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారంను ప్రింట్ అవుట్ తీసి హార్డ్ కాపీని ఆఫ్ లైన్ విధానంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి 09.09.2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
పోస్టుల అర్హతలు, వయస్సు వివరాలు:
వర్క్ షాప్ అటెండర్ : 10v తరగతి Pass అయ్యి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్స్ కలిగి, సంబంధిత విభాగంలో 01 సంవత్సరం అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 – 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
లైబ్రరీ అటెండర్ : 10+2 అర్హత కలిగి లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్స్ కలిగినవారు అర్హులు.18 – 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ : 10+2 అర్హత కలిగి ఇంగ్లీష్ లో 35WPM టైపింగ్ స్కిల్స్ ఉండి కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.18 – 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్ : సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ అర్హత కలిగి ఉర్దూ నౌలెడ్జి ఉన్నవారు అర్హులు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ : సైన్స్ సబ్జెక్టుల్లో 19+2 అర్హత కలిగి డిప్లొమా లేబరటరీ టెక్నాలజీ చేసి 2 సంవత్సరాలు అనుభవం కలిగినవారు అర్హులు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
లైబ్రరీ అసిస్టెంట్ : లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ చేసిన వారు అర్హులు. 18 నుండి సంవత్సరాల వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
SC, ST, అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో 345 గవర్నమెంట్ జాబ్స్ విడుదల
ఎంపిక విధానం:
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించి, అర్హత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి MANUU యూనివర్సిటీలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
జీతం వివరాలు:
పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹50,000/- శాలరీలు ఉంటాయి. TA, DA, HRA వంటి ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి.
తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల
సిలబస్ వివరాలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ వారు రాత రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాలపైన రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
ఈ క్రింద ఇచ్చింది నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు ఫారం లింక్ ఆధారంగా అప్లిస్ పెట్టుకోవాలి. హార్డ్ కాపీని నిర్నీత సమయంలోగా పోస్ట్ ద్వారా పంపించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతి రోజూ Visit చెయ్యండి.